అద్భుతమైన వీడియోను పోస్ట్‌ చేసిన నాగాలాండ్‌ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌ !

Telugu Lo Computer
0


నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్‌  సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆయన పెట్టే పోస్టులు నవ్వులుపూయిస్తాయి. అలాగే తన రాష్ట్రంలోని ప్రకృతి అందాలను పరిచయం చేస్తూ.. నెటిజన్లకు జీవిత సలహాలు ఇస్తుంటారు. తాజాగా భారత్‌లో సూర్యుడు ముందుగా ఉదయించే ప్రదేశాన్ని పంచుకున్నారు. వీడియోలో అరుణాచల్ ప్రదేశ్‌ లోని డాంగ్‌ వ్యాలీ - భారతదేశంలో సూర్యుడు ముందుగా ఉదయించే ప్రాంతం. అద్భుతమైన పర్వత ప్రకృతి సోయగాల గుండా తిరిగే రహదారి, అంతే కాకుండా చుట్టూ పచ్చని పర్వత లోయ, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు పచ్చని తివాచీలా ఉంది. ఎత్తెన పర్వత శిఖరాల మధ్య ఉన్న నదీ ప్రవాహాలు ఎంతో ఆహ్లాదంగా కనువిందు చేస్తున్నాయి. 'గూగుల్‌ చేసి చూడండి' అని క్యాప్షన్‌ పెట్టి అద్భుతమైన వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ' ప్రస్తుతం ఇక్కడే విహార యాత్రలో ఉన్నాను. కచ్చితంగా చూస్తాను. స్వర్గం లాంటి అందమైన ప్యాలెస్‌ అది ', 'వావ్‌... ఈ ప్రదేశాన్ని ఒకసారైనా సందర్శించాలనుకుంటున్నాను' అని రాసుకొచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)