భారత్‌ వీడనున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 September 2023

భారత్‌ వీడనున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో !


జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. అయితే తాజాగా ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్దినట్లు కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం  వెల్లడించింది. 'కెనడా ప్రధాని విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం పరిష్కారమైంది. విమానం టేకాఫ్‌ అయ్యేందుకు అనుమతులు వచ్చాయి. కెనడా ప్రతినిధులు ఈ మధ్యాహ్నం భారత్‌ నుంచి బయలుదేరే అవకాశం ఉంది' అని కెనడా పీఎంఓ ప్రెస్‌ సెక్రటరీ మహమ్మద్‌ హుస్సైన్‌ మీడియాకు వెల్లడించారు. ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి మరో విమానం భారత్‌కు వస్తోన్న తరుణంలో ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడో పర్యటన సాంతం అసౌకర్యంగానే కనిపించారు. ఈ సమయంలో ఆయన్ను తన విమానమే ఇబ్బందిపెట్టేసింది. ఆదివారం సాయంత్రం భారత్‌ వీడాల్సిన ఆయన రెండు రోజులుగా ఇక్కడే ఉన్నారు. 

No comments:

Post a Comment