మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం తాగితే ఏమవుతుంది ?

Telugu Lo Computer
0


దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సుమారు 10.01 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఇక ప్రీ డయాబెటిక్‌ రోగుల సంఖ్య దాదాపు 15 కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనా ఆందోళన కలిగిస్తోంది. డయాబెటిస్‌తో బాధపడే వారు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూర్తిగా డైట్‌ను మెయింటెన్‌ చేస్తే కానీ ఈ వ్యాధి తాలుకూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా ప్రభావం చూపవు. అందుకే డయాబెటిస్‌ వచ్చిందని తెలియగానే పూర్తిగా డైట్‌ను మార్చేస్తుంటారు. తీసుకునే ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి డయాబెటిస్‌ బాధితులు మద్యం తీసుకుంటే ఎంతటి ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు డయాబెటిస్‌ రోగులు మద్యం తీసుకుంటుంటారు. మాములు వ్యక్తులు ఆల్కహాల్‌ తీసుకుంటేనే ఆరోగ్యానికి హానికరమైతే షుగర్‌ పేషెంట్స్‌ తీసుకుంటే దుష్ఫ్రభావాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా డయాబెటిస్‌ వచ్చిన వారిలో కాళ్లు, చేతుల్లో మంట రావడం గమనిస్తుంటాం. అయితే ఇలాంటి వాళ్లు మద్యం తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇక మద్యం సేవించిన తర్వాత చాలా మంది రాత్రుళ్లు తినకుండానే పడుకుంటారు. ఇది మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. ఇది శరీరంలో కాలేయ పనితీరును పాడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్‌తో బాధపడే వారు ప్రతీరోజూ కచ్చితంగా ట్యాబ్లెట్స్‌ వేసుకోవాలనే విషయం తెలిసిందే. అయితే మద్యం సేవించిన తర్వాత ట్యాబ్లెట్స్‌ తీసుకుంటే కడుపులో మంట, వాంతులు కావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మదుమేహంతో బాధపడేవారు ఆల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాలేయ పనితీరు దెబ్బ తినడం వల్ల గ్లూకోజ్‌ స్థాయిలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాలేయంపై దుష్ఫ్రభావం చూపే ఆల్కహాల్‌ను వదిలేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. మధుమేహంతో బాధపడేవారు లైఫ్‌ స్టైల్‌లో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తృణ ధాన్యాలు, తాజా కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువ తినడం కంటే ఎక్కువసార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలో కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవచ్చు. అలాగే రోజులో కనీసం 3 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)