పరస్పర సహకారాన్ని, ఏకాభిప్రాయ విధానాన్ని పెంపొందించుకోవాలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 September 2023

పరస్పర సహకారాన్ని, ఏకాభిప్రాయ విధానాన్ని పెంపొందించుకోవాలి !


కొత్త పార్లమెంట్ భవనం వేదికగా మంగళవారం నుంచి సభాకార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ, ఇతర ఎంపీలు కొత్త భవనానికి ర్యాలీగా తరలివెళ్లారు. అంతకు ముందు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాల్‌లో పార్లమెంట్ గొప్ప వారసత్వాన్ని స్మరించుకొనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగించారు. "ప్రజాస్వామ్య దేవాలయాల్లో నిబంధనల అతిక్రమణలను వదులుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడుతోన్న వేళ, పరస్పర సహకారాన్ని, ఏకాభిప్రాయ విధానాన్ని సభ్యులు పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మక వైఖరికి వీడ్కోలు పలికేందుకు, జాతీయ ప్రయోజనాలను ఉన్నతంగా ఉంచాలని నిర్ణయించుకునేందుకు ఇదే సమయం. దీంతోపాటు పార్లమెంటరీ పనితీరులో ఆటంకాలను ఆయుధాలుగా మార్చుకోవడమనే వ్యూహాన్ని పక్కన పెట్టేందుకు ఇదే సరైన సమయం" అని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. ఇవి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైనవని, వాటికి ప్రజల ఆమోదం ఎప్పటికీ ఉండదని చెప్పారు.

No comments:

Post a Comment