అయోధ్య నుంచి చెన్నైకు పాదయాత్రలు చేపడతాం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 September 2023

అయోధ్య నుంచి చెన్నైకు పాదయాత్రలు చేపడతాం !


మిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న అయోధ్యలోని జ్ఞానులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాలిన్‌కు నిరసనగా తమిళనాడు వైపు పెద్దఎత్తున పాదయాత్రలు చేపడతామని హెచ్చరించారు. అయోధ్యలో నిర్వహించిన ధర్మ సంసద్‌లో సాధువులు, జ్ఞానులు హిందూ మతంపై మాటలను ఖండించారు. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం పేరుతో రాజకీయ నాయకులు ప్రమాణం చేసి సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రకటన సమాజంలో చీలికలను సృష్టించే ఎత్తుగడ అని, దీనిని సుప్రీంకోర్టు గమనించాలని అన్నారు. అలాంటి వ్యక్తులు దేశంలో హింసను ప్రేరేపించాలనుకుంటున్నారని తెలిపారు. ఉదయనిధి స్టాలిన్‌ క్షమాపణలు చెప్పాలని ఒక వారం అల్టిమేటం ఇచ్చారు. సనాతన్ మతంపై విశ్వాసం ఉన్నవారు ఉదయనిధి స్టాలిన్ లాంటి వారికి తగిన సమాధానం చెబుతారని అన్నారు. 

No comments:

Post a Comment