మహారాష్ట్రలో స్క్రబ్ టైఫస్ వైరస్ !

Telugu Lo Computer
0


డిశాలో రెండు వందల మందికిపైగా సోకి ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మొత్తం 16 కేసులను గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించినట్లు వివరించారు. ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికి ఐదుగురు చనిపోగా.. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో మరో ఐదుగురు ఈ వైరస్ బారినపడి మరణించారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేకపోవటం అందరినీ కలవరపాటుకి గురిచేస్తోంది. ఇప్పుడు ఒకేసారి 16 కేసులు బయటపడిన నేపథ్యంలో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు, వారి సన్నిహితులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టారు. ఈ స్క్రబ్ టైఫస్ ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇప్పటికే వెల్లడించింది. ఇన్ఫెక్షన్ సోకిన కీటకాల(లార్వా మైట్స్) కాటు ద్వారా వ్యాపిస్తుంది. వ్యవసాయ భూములు, అడువులను తరుచుగా సందర్శించే వారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు తేలింది. క్రిమి కాటు వల్ల ఏర్పడే మచ్చ ఈ వ్యాధికి ఒక సంకేతం అని, అది గుర్తించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు చెప్తున్నారు. కుట్టిన చోట చర్మకణాలు చనిపోతాయి. అధిక జ్వరం, పొడి దగ్గు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కళ్ళలో ఎరుపు, శరీరంపై ఎరుపు మచ్చలు లేదా దద్దుర్లు, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. పురుగు కుట్టిన పది రోజుల తర్వాత వైరస్ లక్షణాలు కనిపిస్తాయని సమాచారం. వీలైనంత త్వరగా యాంటీ బయోటిక్స్ ఇవ్వటం ద్వారా బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వెంటనే చికిత్స తీసుకోకపోతే ఇది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుందని, ప్రాణాంతకం అవుతుందని వైద్యులు చెప్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)