తోటి విద్యార్థుల చే విద్యార్థిని టీచర్ కొట్టించిన కేసులో దర్యాప్తు నివేదిక కోరిన సుప్రీం కోర్టు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 September 2023

తోటి విద్యార్థుల చే విద్యార్థిని టీచర్ కొట్టించిన కేసులో దర్యాప్తు నివేదిక కోరిన సుప్రీం కోర్టు !


త్తరప్రదేశ్ ఖుబ్బాపూర్ గ్రామంలో తోటి విద్యార్థులచే ముస్లిం విద్యార్థిని టీచర్ కొట్టించిన కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు బుధవారం ముజఫర్‌నగర్ పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరింది. ఆ విద్యార్థికి, తల్లిదండ్రులకు ఎంతవరకు రక్షణ కల్పించారో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిథాల్ తో కూడిన ధర్మాసనం ఎస్‌పిని కోరింది. దీనిపై సెప్టెంబర్ 25 నాటికి సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ మహాత్మాగాంధీ మనుమడు తుషార్ గాంధీ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. హోమ్ వర్క్ చేయలేదని రెండో తరగతి ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులచే టీచర్ త్రిప్త త్యాగి దాడి చేయించారనే ఆరోపణలు రావడమే కాక, ఈ సంఘటన వీడియో వైరల్ అయింది. దీనిపై రాష్ట్ర విద్యావిభాగం ఆ స్కూలుకు నోటీస్ జారీ చేసింది. వీడియో వైరల్ అయిన మరునాడు టీచర్‌పై కేసు నమోదైంది.

No comments:

Post a Comment