డీటీసీకి 400 అత్యాధునిక ఈవీ బస్సులను సరఫరా చేసిన టాటా మోటార్స్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 September 2023

డీటీసీకి 400 అత్యాధునిక ఈవీ బస్సులను సరఫరా చేసిన టాటా మోటార్స్ !


టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థ టీఎంఎల్ సీవీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా ఢిల్లీ ట్రాన్స్‌ పోర్ట్ కార్పొరేషన్ కి 400 అత్యాధునిక స్టార్‌బస్ ఈవీ బస్సులను సరఫరా చేసింది. రాజధాని ప్రాంతం అంతటా సురక్షితమైన, సౌకర్యవంతమైన, సౌలభ్యవంతమైన ఇంట్రా-సిటీ ప్రయాణాన్ని అందించడానికి ఇవి రూపొందించారు. ఈ విస్తరణతో టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఇ-బస్సులను సరఫరా చేసే ముఖ్యమైన మైలురాయిని సాధించింది. 400 ఈ-బస్సుల సముదాయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించారు. జీరో-ఎమిషన్, సైలెంట్ ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాన్ని స్వాగతిస్తూ డీటీసీ మేనేజింగ్ డైరెక్టర్ శిల్పా షిండే మాట్లాడుతూ, "డీటీసీ ఢిల్లీ పౌరులకు సమర్థవంతమైన, ఆర్థిక, విశ్వసనీయమైన రోడ్డు రవాణా సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. ఈ 400 ఎలక్ట్రిక్ బస్సుల జోడింపు జాతీయ రాజధాని భూభాగం అంతటా మాస్ మొబిలిటీని సురక్షితమైందిగా, తెలివైందిగా, కాలుష్యరహితంగా మారుస్తుంది'' అని అన్నారు.

No comments:

Post a Comment