తెలుగు రాష్ట్రాల్లో రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు !

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ భారీ వర్ష సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు.. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు ఎడతెరపిలేకుండా వర్షం కురవడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)