స్కూటీని ఢీకొట్టిన కారు - రెండు ముక్కలైన స్కూటీ !

Telugu Lo Computer
0


ర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్‌ పట్టణంలో స్కూటీపై రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ రెండు ముక్కలైంది.  ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఎగిరిపడ్డాయి. ఆ స్కూటీపై వెళ్తున్న మహిళ ఎగిరి గాయాలతో పక్కన పడిపోయింది. అయినా, కారు డ్రైవర్‌ ఆపకుండా అదే వేగంతో పారిపోయాడు. ఈ ప్రమాదం దృశ్యాలను రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు ఢీకొట్టి వెళ్లిపోగానే తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న మహిళను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)