అగరుబత్తులు వెలిగిస్తున్నారా ?

Telugu Lo Computer
0


నం అగరుబత్తి, దూప్ స్టిక్స్ వెలిగించడం వల్ల ఉన్నట్టుండి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఆ సమస్యను మనం తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే.. చాలాసమయాల్లో దూప్‌స్టిక్స్, అగరుబత్తులు పాలీఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, కార్బన్‌డైఆక్సైడ్ కలిగిఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలే కాదు.. ఆస్తమా, క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా చుట్టుముడతాయి. అగరుబత్తులు, స్టిక్స్‌లను వెలిగించడం వల్ల విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్‌డై మోనాక్సైడ్‌ల కారణంగా చిన్నపిల్లలు, యువకుల్లో చర్మ, కంటి సంబంధిత అలర్జీలు వస్తున్నాయి. అంతేకాదు.. ఎక్కువగా ఈ వాయువును పీల్చడం ద్వారా COPD, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. సమస్య ముదిరితే ఉపిరితిత్తుల శాసనాళాల్లో పొగు ఎక్కువగా మారి క్యాన్సర్‌కి కారకమవుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఇలాంటి సమస్యలను గమనించినప్పుడు.. ముందుగానే మేల్కోవడం చాలా ముఖ్యం.

Post a Comment

0Comments

Post a Comment (0)