నుహ్ లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరణ

Telugu Lo Computer
0

 


ర్యానాలోని నుహ్ జిల్లాలో  విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) చేపట్టిన ఊరేగింపు మత ఘర్షణలకు దారితీసిన తరువాత జులై 31 నుండి ఆగస్ట్‌ 8 వరకు ఇంటర్నెట్‌ సేవలనునిలిపివేశారు. వీటిని ఆదివారం అర్థరాత్రి నుండి పునరుద్ధరించినట్లు పోలీసులు తెలిపారు. జులై 31న నుహ్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) చేపట్టిన ఊరేగింపు మత ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో నుహ్ జిల్లాతో పాటు గురుగ్రామ్‌లో కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు, క్లర్క్‌ సహా ఆరుగురు మరణించారు. దీంతో జులై 31 నుండి ఆగస్ట్‌ 8 వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం ఈ నిలిపివేతను ఆగస్ట్‌ 13 వరకు పొడిగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)