విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 August 2023

విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం


రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యం గల పనివారికి, వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే "ప్రధాని మంత్రి  విశ్వకర్మ " పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం గురించి మోడీ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిందని తెలిపారు. ఈ పథకం కోసం ఐదేళ్లపాటు రూ. 13,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. తొలిదశలో 18 సంప్రదాయ వృత్తులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. వారికి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్లను జారీ చేసి గుర్తిస్తామని, ఆ తరువాత తొలిదశలో వారికి రూ.1 లక్షవరకు , రెండోదశలో రూ.2 లక్షల వరకు రుణసదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ రుణంపై రాయితీ వడ్డీ రేటు 5 శాతం అని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి , వృత్తి సంబంధిత పరికరాల కొనుగోలుకు ప్రోత్సాహం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ మద్దతు అందజేయనున్నట్టు చెప్పారు. వడ్రంగి పనివారు, పడవల తయారీదారులు, బ్లాక్‌స్మిత్, లాక్‌స్మిత్, గోల్డ్‌స్మిత్, కుండల తయారీదారులు, శిల్పులు, చర్మకారులు , తాపీ మేస్త్రీలు తదితరులు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చని చెప్పారు. ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షతరువాత పరికరాల కొనుగోలుకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు.

No comments:

Post a Comment