మేనేజ్‌మెంట్‌ లోపాలపై చర్చించే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంటుంది !

Telugu Lo Computer
0


మిళనాడు గ్రామ బ్యాంకులో లక్ష్మీనారాయణన్‌ అనే వ్యక్తి గ్రూప్‌-బి ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల బ్యాంకు మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆయన మెసేజ్‌ పెట్టాడు. ఆ మేసేజ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టికి వెళ్లడంతో లక్మీనారాయణన్‌పై సీరియస్‌ అయ్యింది. మేనేజ్‌మెంట్‌ తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాలను ఎగతాళి చేయడం క్రమశిక్షణా రాహిత్యంగా పేర్కొంటూ లక్ష్మీనారాయణన్‌కు చార్జి మెమో జారీ చేసింది. దాన్ని లక్ష్మీనారాయణన్‌ మద్రాస్‌ హైకోర్టులో సవాల్‌ చేశాడు. సోమవారం లక్ష్మీనారాయణన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాల్లో లోపాలుంటే చర్చించే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంటుందని స్పష్టం చేసింది. మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలతో ఏ ఉద్యోగికైనా సమస్యలు ఉంటే వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లో వ్యక్తపర్చడం తప్పేమీ కాదని పేర్కొంది. అంతమాత్రాన దాన్ని క్రమశిక్షణా రాహిత్యం కింద లెక్కగట్టడం సబబు కాదని వ్యాఖ్యానించింది. సంస్థ పరువు తీసేలా, లేదంటే సంస్థకు నష్టం జరిగేలా ఉద్యోగి చర్యలు ఉన్నప్పుడు మాత్రమే సంస్థకు అతనిపై చర్యలు తీసుకునే హక్కు ఉందని తేల్చిచెప్పింది.  ఉద్యోగికి క్రమశిక్షణ రాహిత్యం పేరుతో అతను పనిచేసే బ్యాంకు ఇచ్చిన చార్జి మెమో చెల్లదని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.




Post a Comment

0Comments

Post a Comment (0)