అప్పులు తీసుకోవడానికి వీలు కల్పించే ఇన్నోవేటివ్​ సిస్టమ్ !

Telugu Lo Computer
0


క్రెడిట్​ హిస్టరీ లేకపోయినా అప్పులు తీసుకోవడానికి వీలు కల్పించే ఇన్నోవేటివ్​ సిస్టమ్​ను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా తీసుకురానుంది. రైతులైనా, చిన్న వ్యాపారులైనా తొందరగా అప్పులు పొందేలా ఒక కొత్త డిజిటల్​ ప్లాట్​ఫామ్​ను డెవలప్​ చేస్తున్నట్లు క్రెడిట్​ పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ ​వెల్లడించారు. సాఫీగా అప్పులు పొందేలా ఈ ప్లాట్​ఫామ్​ ఉంటుందని, దీనిని రిజర్వ్​ బ్యాంక్​ ఇన్నోవేషన్​​ హబ్​ డెవలప్​ చేస్తోందని చెప్పారు. కిసాన్​ క్రెడిట్​ కార్డు (కేసీసీ)పై అప్పులు ఇచ్చేందుకు ఒక పైలట్​ ప్రాజెక్టును ఆర్​బీఐ, ఆర్​బీఐ ఇన్నోవేషన్​ హబ్​లు చేపట్టాయి. మధ్యప్రదేశ్​, తమిళనాడు, కర్నాటక, యూపీ, మహారాష్ట్రలలోని కొన్ని జిల్లాలలో ఈ పైలట్​ ప్రాజెక్టు ఇప్పటికే నడుస్తోంది. ఈ పైలట్​ ఆధారంగా ఇప్పుడు కొత్త పబ్లిక్​ టెక్ ​ప్లాట్​ఫామ్​ డెవలప్​ చేయనున్నారు. రైతులు, డెయిరీ ఫార్మ్​లు నడిపే వారిలో చాలా మందికి క్రెడిట్​ హిస్టరీ లేకపోవడంతో అప్పులు పుట్టడం కష్టమవుతోంది. లెండింగ్​లో ఇదొక ఓఎన్​డీసీ లాంటి ఇన్నోవేషన్​గా ఆర్​బీఐ చెబుతోంది. మరోవైపు యూపీఐ లైట్‌తో చేసే ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి 500 కి ఆర్‌బీఐ పెంచింది. సిస్టమ్​లో లిక్విడిటీ తగ్గించే లక్ష్యంతో క్యాష్​రిజర్వ్​ రేషియో (సీఆర్​ఆర్​)ను ఇంక్రిమెంటల్​గా 10 శాతం ఆర్​బీఐ పెంచింది. దీంతో సిస్టమ్​నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆర్​బీఐ వద్దకు చేరుతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇదే సరైన ఆప్షన్​గా ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. అప్పులు ఇవ్వడానికి తగినంత డబ్బు బ్యాంకుల వద్ద ఉందని, ఆ లిక్విడిటీ సరిపోతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు రెపో రేటును 6.50 శాతం వద్దే కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ మెంబర్లందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. సీఆర్​ఆర్​ పెంపు ఈ ఏడాది సెప్టెంబర్​ 8 దాకా అమలులో ఉంటుందని దాస్​ వెల్లడించారు. జూన్​ 2022 నుంచి చూస్తే ఈ ఏడాది ఆగస్టు 14 నాడు సిస్టమ్​లో అత్యధికంగా రూ. 2.48 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీ ఉన్నట్లు డేటా చెబుతోంది. తాజా డేటా ఆధారంగా సెప్టెంబర్​ 8 న సీఆర్​ఆర్ ​పెంపును రివ్యూ చేయనున్నట్లు ఎంపీసీ డిపార్ట్​మెంట్​ హెడ్, ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ మైఖేల్​ పాత్ర చెప్పారు. కూరగాయల రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ధరల కట్టడి కోసం తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని, అవసరమైతే వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందని దాస్​ పేర్కొన్నారు. జియో పొలిటికల్​ టెన్షన్లు కొనసాగుతున్నాయని, మరోవైపు వాతావరణ పరిస్థితుల వల్లా ఇబ్బందులెదురవుతున్నాయని దాస్ అన్నారు. ఇన్‌ఫ్లేషన్‌ సమస్యలు ఇంకా ముగిసిపోలేదని చెప్పారు. మార్కెట్​ నుంచి రూ. 2 వేల నోటును విత్​డ్రా చేయడంతో లిక్విడిటీ భారీగా పెరగడానికి ఒక కారణమైందని చెబుతూ, 90 శాతం రూ. 2 వేల నోట్లు (రూ. 3.60 లక్షల కోట్లు) వెనక్కి వచ్చేశాయని దాస్​ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)