ఎలాంటి సమస్యలున్నా క్షణాల్లో పరిష్కారం ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

ఎలాంటి సమస్యలున్నా క్షణాల్లో పరిష్కారం ?


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ చందాదారుల వ్యక్తిగత వివరాలను వేగంగా సరి చేసుకునేందుకు కొత్త నింబధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు తండ్రి పేరు ఎక్స్ అని ఉందని, డేటా బేస్‌లో ఉన్న పేరుతో దరఖాస్తులోని చందాదారుడు, తండ్రి పేరు సరిగ్గా లేదు.. ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టారు.. లాంటి కారణాలతో ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కారానికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఈపీఎఫ్ఓ అమలు చేస్తూ ఈ- కేవైసీని తీసుకువచ్చింది. ఈపీఎఫ్ ఖాతాదారుడి వ్యక్తిగత వివరాల్లో ఏదైనా మార్పులు పేరుతో జరిగే మోసాలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా అప్లికేషన్ కేటగిరీ ఆధారంగా చిన్న చిన్న సవరణల్ని వారం రోజుల్లో పెద్ద సవరణలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు పెట్టింది. నిబంధనలు పాటించని అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను అప్డేట్ కోసం ఖాతాదారులు ప్రతి రోజూ రీజల్ ఆఫీసుల చుట్టూ తిరగుతున్నారని గుర్తించారు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలన్నా.. ఏదో ఒక కారణంతో అప్లికేషన్లను ఈపీఎఫ్ అధికారులు తిరిగి పంపించేస్తున్నారు.. దీంతో పర్సనల్ వివరాల సవరణ కోసం ఉద్యోగులు సంబంధిత యజమానితో సంతకం చేయించి, రీజనల్ ఆఫీసులో జాయింట్ డిక్లరేషన్లు అందిస్తున్నారు. ఇలా వచ్చిన ఫిర్యాదులపై ఈపీఎఫ్ఓ వెంటనే చర్యలు తీసుకోకపోడవడం, అప్లికేషన్ పరిష్కారానికి సరైన సమయం లేకపోడవంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు మరింత పారదర్శక సేవల కోసం నూతన విధానం తీసుకొచ్చినట్లు తెలిపింది.

ఈపీఎఫ్ ఖాదాదారుడి పేరు, లింగం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, బంధుత్వం, వివాహస్థితి, ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం, జాతీయత, ఆధార్ నంబర్ మార్చుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. అయితే, వివాహానికి సంబంధించి మాత్రమే రెండుసార్లు మార్పు చేసుకునే ఛాన్స్ ఉంది. మిగతా వివరాలన్నీ ఒకసారి సవరిస్తారు. ఏదైన అత్యవసర పరిస్థితుల్లో ఒకటికి మించి సవరణ చేయాల్సిన పరిస్థితుల్లో రీజనల్ కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తులను రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. పేరులో రెండు అక్షరాల్లోపు, ఇంటిపేరు, పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరు మార్పులాంటివి చిన్న సవరణలుగా.. అంతకన్నా ఎక్కువైతే పెద్ద సవరణగా లెక్కిస్తారు. చిన్న వాటికి రెండు, పెద్ద వాటికి మూడు ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. సకాలంలో దరఖాస్తుల్ని పరిష్కరించుకుంటే EPPOIGMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 

No comments:

Post a Comment