ఇండియా మూడవ సమావేశం ప్రారంభం !

Telugu Lo Computer
0


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విపక్షాల కూటమి ఇండియా మూడవ సమావేశం ప్రారంభమైంది. మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే సహా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇండియా కూటమికి కన్వీనర్ గా నితీశ్ కుమార్‭ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు, రేపు విపక్షాల మూడవ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఇండియా కన్వీనర్ ‭ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితీశ్ కు ఐదు పార్టీల నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 11 మందితో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఐదుగురి మద్దతు ఉన్నందున నితీశ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)