తస్మాత్ జాగ్రత్త !

Telugu Lo Computer
0


బ్యాంకు కేవైసీ, పాన్ కార్డు, ఆన్ లైన్ లింకులు పంపించి బ్యాంకు మోసాలు మనకు తెలుసు. తరచూ ఈ తరహా మోసాలు చూస్తూనే ఉంటాం. చాలా మంది పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇలా పోగొట్టుకున్నారు. అయితే మన లావాదేవీలు ఎక్కువగా ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ ద్వారా చేస్తుండటంతో నేరగాళ్లు ఇప్పుడు వీటి ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నారు. మొబైల్ పేమెంట్ యాప్ ల గేట్ వేలను వినియోగించుకొని ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే మీకు రూ. 10 నుంచి రూ. 50 వరకూ మీకు పంపించి, దయచేసి వెనక్కి ఇవ్వాలని అడుగుతారు. అలా వెనక్కి వేశారో అంటే మాల్ వేర్ తో అటాక్ చేసి అకౌంట్ హ్యాక్ చేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారానో, లింక్ ద్వారానో  ఖాతాలలోని డబ్బుని  సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టేస్తున్నారు. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు పడుతున్నా ఏదో రూపంలో స్కామర్లు దాడికి పాల్పడుతూనే ఉన్నారు.  ఒక్కటే మార్గం. అది వినియోగదారుల అవగాహన, అప్రమత్తత ద్వారా వీటిని అరికట్టవచ్చు.  అకస్మాత్తుగా మీ ఫోన్ కి ఓ అపరిచిత నంబర్ నుంచి కాల్ వస్తుంది. హాయ్ బ్రో! అనుకోకుండా మా ఫ్రెండ్ కు పంపించబోయి.. మీ అకౌంట్ కు డబ్బులు పంపాను. తిరిగి నాకు ట్రాన్స్ ఫర్ చేయండి ప్లీజ్! అంటూ నెమ్మదిగా ట్రాప్ లోకి లాగుతారు. వారు వేసి మొత్తం కూడా పెద్ద మొత్తంలో ఉండదు. రూ. 10 నుంచి రూ. 50 లోపే ఉంటుంది. చిన్న మొత్తమే కదా అని తిరిగి మీరు ట్రాన్స్ ఫర్ చేశారో అంతే. మన యూపీఐ ఐడీ ద్వారా ఖాతాను హ్యాక్ చేసి క్షణాల్లో ఖాతాలోని డబ్బులను కొల్లగొడతారు. ఇంకో విధానంలో కూడా వినియోగదారులను బుట్టలో వేసుకుంటారు నేరగాళ్లు. అదేంటంటే లక్కీ డ్రాలో గెలిచినట్లు చెబుతూ గూగుల్ పే ద్వారా వారి ఖాతాలకు డబ్బు పంపమని వినియోగదారులను అడుగుతారు. తిరిగి వారు చెక్ కోసం అంటూ కొంత మొత్తాన్ని తిరిగి పంపుతారు. ఆ తర్వాత మరింత మొత్తాన్ని బదిలీ చేయమని అడుగుతుంది. ఈ మొత్తాన్ని బదిలీ చేసినప్పుడు అది పలు పర్మిషన్లను అంగీకరించమని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేసిన వెంటనే ఖాతా నుండి డబ్బు డెబిట్ అవతాయి.

* మీ గూగుల్ పే పిన్ ని ఎవరితోనూ షేర్ చేయవద్దు.

* మీ ఫోన్ స్క్రీన్ కి లాక్ లు వేయండి.

* ఎవరైనా పొరపాటున మీ యూపీఐకి డబ్బు పంపి, మీకు కాల్ చేస్తే, మీరు డబ్బును తిరిగి ఇవ్వవద్దు.

* మీరు అతన్ని దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి, మీరు మోసపోకుండా ఉండటానికి డబ్బు అతనికి ఇవ్వండి.

* మోసం జరిగినట్లు గుర్తిసే మీరు భారత ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

* అలాగే ఏ తరహా సైబర్ మోసమైనా మీరు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు .

Post a Comment

0Comments

Post a Comment (0)