న్యూయార్క్‌ లోని ఇంటిని అమ్మిన ముకేశ్‌ అంబానీ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 August 2023

న్యూయార్క్‌ లోని ఇంటిని అమ్మిన ముకేశ్‌ అంబానీ


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీకి న్యూయార్క్‌ లోని మాన్‌హట్టన్‌ లో ఓ విలాసవంతమైన ఇల్లు  ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటిని ముఖేశ్ అంబానీ అమ్మేశారని న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది. మాన్‌హట్టన్‌ వెస్ట్‌ విలేజ్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో ఫ్లోర్‌ లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని అంబానీ 9 మిలియన్‌ డాలర్లకు విక్రయించారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. దీని ధర భారత కరెన్సీలో రూ.74.53 కోట్లు. అంబానీ అమ్మేసిన ఇంటిని సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరి అని కూడా పిలిచేవారు. హడ్సన్ నదీ తీరాన ఉన్న ఈ విల్లా 10 అడుగుల ఎత్తుల సీలింగ్స్, హెరింగ్‌బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్స్ తో బయట నుంచి చిన్నపాటి సౌండ్ కూడా లోపలికి వినిపించకుండా ఉండేలా కిటీల నిర్మాణం ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలు ఉండే ఈ ఇంటినుంచి చూస్తే హడ్సన్ నదీ అందాలు కనిపించేలా ఉంటుంది. ఇక ఇంటీరియర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అత్యద్భుతంగా ఉంటుంది. మూడు బెడ్ రూములు, మూడు స్మిమ్మింగ్ రూమ్స్, పిల్లలు ఆడుకునే ఓ ఆటగది, పిలేట్స్ రూమ్, యోగా రూమ్, విశాలమైన లాంజ్, వాలెట్ పార్కింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ ఇంటి సొంతం. 

No comments:

Post a Comment