రూ. 6 కోసం 26 ఉద్యోగాన్ని కోల్పోయిన రైల్వే టికెట్ క్లర్క్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 August 2023

రూ. 6 కోసం 26 ఉద్యోగాన్ని కోల్పోయిన రైల్వే టికెట్ క్లర్క్ !


ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ పని చేసేవారు. అయితే పలుసార్లు ఫిర్యాదులు రావడంతో అతడిపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్యాసింజర్‌గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ టికెట్ ఇచ్చారు కానీ సరిపడా చిల్లర తిరిగి ఇవ్వలేదు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ రూ.280 మాత్రమే ఇచ్చారు. ఆరు రూపాయలు తిరిగి ఇవ్వలేదు. విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనుక ఉన్న అల్మారాలో రూ. 450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. రూ. 6 చిల్లర లేనందునే అతడిని డబ్బులు ఇవ్వలేకపోయాయని, ఆ అల్మారాను తనతో పాటు ఉద్యోగులందరూ వినియోగిస్తున్నారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది.

No comments:

Post a Comment