భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం !

Telugu Lo Computer
0


న్నత చదువులు చదివేందుకు అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సరైన పత్రాలు లేవంటూ దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు వెళ్లగా, సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్ పోర్ట్స్ నుంచే అధికారులు భారత విద్యార్థులను వెనక్కి పంపారు. దీంతోపాటు ఆ విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్లపాటు పాటు నిషేధం విధించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)