వి.ఎస్‌.అరుణాచలం కన్నుమూత

Telugu Lo Computer
0


భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివో) మాజీ చీఫ్‌ డాక్టర్‌ వి.ఎస్‌ అరుణాచలం (87) బుధవారం కన్నుమూశారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. అరుణాచలం మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ అరుణాచలం మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 'అరుణాచలం మృతి శాస్త్రీయ సమాజానికి, వ్యూహాత్మక ప్రపంచానికి తీరనిలోటుని మిగల్చింది. అతని జ్ఞానం, పరిశోధన పట్ల ఉన్న అతనికున్న మక్కువతో భారతదేశం యొక్క భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడంలో గొప్ప సహకారాన్ని అందించారు' అని ప్రధాని తన అధికారిక 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా అరుణాచలం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా అరుణాచలం మృతి పట్ల సంతాపం తెలిపారు. 'భారత్‌ - అమెరికా సంబంధాలపై తనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్పవరంగా భావిస్తున్నట్లు జైశంకర్‌ పేర్కొన్నారు. అలాగే డిఆర్‌డిఓ సంస్థ కూడా తన అధికారిక 'ఎక్స్‌'లో పోస్టు చేసింది. 'మొదటి డిఆర్‌డిఓ శాస్త్రవేత్త వి.ఎస్‌. అరుణాచలం నాయకత్వానికి డిఆర్‌డివో సెల్యూట్‌ చేస్తోంది. సాంకేతికతను అభివృద్ధి చేయడం పట్ల అతని అంకితభావమే ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆయన వారసత్వం ప్రగతికి స్పూర్తినిస్తూనే ఉంటుంది' అని డిఆర్‌డివో పోస్ట్‌లో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)