వర్షాకాలం - ఆకుకూరలు

Telugu Lo Computer
0


ర్షాకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ వర్షాకాలంలో మాత్రం ఈ ఆకు కూరలు తినకపోవడమే మంచిదట. వర్షాకాలంలో ఆకుకూరలు ఎప్పుడూ తేమగా ఉంటాయి. దానివల్ల దానిలోని పోషకాలన్నీ శరీరానికి అందే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కు తగినంత సూర్యరశ్మిలేకపోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉందని ఆహార నిపుణుల అభిప్రాయం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్ , ఆకులు కలిగిన కూరలు చాలా దగ్గరగా అరలి వుండటం వల్ల వాటిలోపలి క్రిములు చేరడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా న్యూట్రీషియన్ వెజిటేబుల్స్ లో మట్టిలో ఎక్కువ నీరు గల ప్రాంతంలో పండిస్తారు క్రిములు వాటిలో తిష్టవేస్తాయి. వర్షాలకు క్రిములుచేరి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతుంది ఆహార నిపుణుల అంటున్నారు. వర్షాకాలంలో ఆకుకూరలును తినాల్సి వచ్చినప్పుడు, వేడినీళ్ళలో ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడగాలి., నీరు పూర్తిగా వంపేసి తర్వాత బాగా ఉడికించి ఆహారంలో తీసుకోవాలి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)