ఐదో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్ 3

Telugu Lo Computer
0


చంద్రునిపై అడుగు పెట్టేందుకు సమయం మరింత దగ్గర పడింది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 మరో అడుగు ముందుకేసింది. ఇటీవలే నాలుగో కక్ష్యలో భూమి చుట్టూ తిరిగి వ్యోమనౌక ఇప్పుడు ఐదో కక్ష్యలోకి అడుగుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టగా.. తదుపరి కక్ష్యలోకి విజయవంతంగా ఫైరింగ్ నిర్వహించినట్లు ప్రకటించింది. వ్యోమనౌక భూమి చుట్టూ తిరిగే ప్రక్రియలో చంద్రయాన్ 3కి సంబంధించి ఇది చివరి కక్ష్య కావడం చెప్పుకోదగిన విషయం. ఈ కక్ష్య తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ విన్యాసాన్ని ఆగస్టు 1 చేపట్టనున్నట్టు ఇప్పటికే ఇస్రో వెల్లడించింది. జూలై 14న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. మరుసటిరోజు కక్ష్యను పెంచడం మొదలుపెట్టారు. ఇలా పలు దశల వారిగా.. ఇప్పటివరకు ఐదు సార్లు కక్ష్యలను పెంచి.. చంద్రయాన్ 3ని చంద్రుని వద్దకు చేరుస్తున్నారు. అంటే ఈ కక్ష్య పూర్తయిన తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుందన్నమాట. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. ఆగస్టు 23న సాయంత్రం ఇది జాబిల్లిపై ల్యాండర్ ల్యాండ్ అవుతుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)