వాము - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వామును ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ నుంచి ఉపశమనం కోసం దివ్య ఔషధం. అర టీస్పూన్ వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఈ నీటిని ఉదయాన్నే వడగట్టి రోజూ తాగడం వల్ల బరువుతో పాటు పొట్ట కూడా తగ్గుతుంది. వాము టీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు పొట్ట కొవ్వు కూడా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే వాము టీని తీసుకోవచ్చు. వాము టీ తయారీ కోసం ఒక గిన్నెలో సగం గ్లాసు నీరు తీసుకొని అర టీస్పూన్ వాము వేసి 2 నుంచి 3 నిమిషాలు వేడిచేయండి. ఆ తర్వాత ఈ నీటీని ఫిల్టర్ చేసి తాగాలి. వాము తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. బరువు తగ్గడానికి వామును నమిలి అర గ్లాసు నీటిని తాగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)