ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి !

Telugu Lo Computer
0


మహీంద్రా కంపెనీకి చెందిన లేటెస్ట్ స్కార్పియో ఎన్ ఒక పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఎస్యూవి  చెట్టుకి ఢీ కొట్టడం వల్ల కారు పై భాగం మొత్తం ఒక పక్కకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ లోపల ఉన్న ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగలేదు, కానీ గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ ఒక మహిళ ఈ ప్రమాదం గురించి 'ఆనంద్ మహీంద్రా'కి ట్వీట్ చేసింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి డ్రైవింగ్ చేసే సమయంలో నిద్రపవడంతో ఈ పెను ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు చూస్తే ఒక్క సారిగా భయం కలుగుతుంది. కారు అటవీ ప్రాంతం గుండా వెళ్తూ చెట్టుకి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనపుడు స్కార్పియో ఎన్ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదని ఓనర్ వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయం మీదనే బిబేకానంద దాస్ ట్వీట్ చేస్తూ కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని, ఈ ప్రమాదం వల్ల తన చిన్న కూతురు పరిస్థితి విషయంగా ఉందని, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడమే దీనికి కారణమని, దీని మీద తప్పకుండా మరింత దృష్టి సారించాలని కోరింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో  వైరల్ అయిపోతోంది. ప్రస్తుతానికి ఆనంద్ మహీంద్రా దీనిపైన స్పందించలేదు. కాగా ఇప్పటి వరకు స్కార్పియో ఎన్ కారుకి ఇలాంటి ప్రమాదం సంభవించలేదు, ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంటే అందులో ఉన్న పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ మనకు ఇట్టే అర్థమైపోతాయి. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యువిలో జరిగిన ఈ సంఘటన ఈ కారు కొనుగోలుదారులతో కొంత భయాందోళనను కలిగించింది. ఈ ఎస్‌యువి అడల్స్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 34 పాయింట్లకు గానూ 2.25 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 48 పాయింట్లకు గానూ 28.94 పాయింట్లను సాధించి, మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ ఏడు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదనేదానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)