ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి

Telugu Lo Computer
0


ఒడిశా రైలు ప్రమాదంపై పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. 'మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం' అని టెలిగ్రామ్‌ ద్వారా ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒక సందేశం పంపారు. 'విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం' అంటూ రిషి సునాక్‌ ఒక ట్వీట్‌చేశారు. 'ఒడిశా ప్రమాద ఘటనలో భారత్‌కు సంఘీభావంగా నిలుస్తున్నాం' అని మాక్రాన్‌ ట్వీట్‌చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్‌ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహాల్‌ (ప్రచండ) , పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్‌ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)