రాజస్తాన్‌లో భారీగా లిథియం నిల్వలు !

Telugu Lo Computer
0


రాజస్తాన్‌లో లిథియం ఖనిజ నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. డేగానా (నాగౌర్‌) లోని రెన్వాత్‌ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ), మైనింగ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్తాన్‌లో అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశ అవసరాల్లో 80 శాతం రాజస్తాన్‌లోని నిల్వలు తీర్చగలవని అన్నారు. భారత్‌ లిథియం కోసం ప్రధానంగా చైనాపై ఆధారపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోనే ఈ ఖనిజం ఉంది. దీనిని మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)