శ్రమ జీవి సాధించిన ఘనత !

Telugu Lo Computer
0


అమెరికాలోని లాస్‌వెగాస్‌ లోని బర్గర్‌కింగ్‌ ఫుడ్ చైన్‌ రెస్టారెంట్‌లో  కెవిన్ ఫోర్డ్ గత 27 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం చేయడం అంటే అవసరాల కోసమే, డబ్బు కోసమే కాదని క్రమశిక్షణతో చేసే ఓ బాధ్యత అని కెవిన్ ఫోర్డ్ నిరూపించాడు. తన 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదట. సెలవు పెట్టకుండా 27సంవత్సరాల పాటు పని చేసి పదవీ విరమణ చేశాడు. సదరు సంస్థతో పాటు యూకేలోని డైలీ ఎక్స్‌ప్రెస్‌ వార్త పత్రిక కూడా ఈ విషయం తెలియజేసింది. 54 ఏళ్ల బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్‌ ఫోర్డ్ ఉద్యోగం చేస్తున్నంత కాలంలో సంపాధించిన జీతం, బోనస్ సంగతి పక్కన పెడితే రిటైర్మెంట్ తర్వాత అతని సేవలు, శ్రమను గుర్తించి విరాళాల రూపంలో వస్తున్న డబ్బు ఎక్కువగా ఉంది.  ఇంత సిన్సియర్‌గా ఉద్యోగం చేసిన కెవిన్‌ ఫోర్డ్‌కు రివార్డ్ ఇవ్వడానికి గోఫండ్‌మీ అనే క్యాంపెయిన్‌ ద్వారా $400,000 అమెరికన్ డాలర్లు అందుకున్నాడు. వ్యక్తిగత జీవితం కోసం వృత్తిని నమ్ముకొని పని చేసినందుకు కెవిన్ ఫోర్డ్‌కు రిటైర్మెంట్ తర్వాత ఫలితం దక్కింది. 27ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేసినందుకు ప్రతిఫలం రిటైర్మెంట్ తర్వాత అందుకోవడం గర్వంగా ఉందంటున్నాడు. తాను అందుకున్న బహుమతి బ్యాగ్‌ను తెరిచి చూపించాడు కెవిన్ ఫోర్డ్. అయితే విచిత్రం ఏమిటంటే ఈ వీడియో సోషల్ మీడియాలో ఏడాది తర్వాత వైరల్ అయింది. తన కష్టానికి కంటే క్రమశిక్షణకు వచ్చిన గుర్తింపుగా కెవిన్ భావిస్తున్నాడు. 


Post a Comment

0Comments

Post a Comment (0)