డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ ప్రచారం !

Telugu Lo Computer
0


బెంగళూరులో మోడీ రోడ్ షో నిర్వహించడం వరుసగా ఇది రెండో రోజు. తొలి రోజైన శనివారం 26 కిలోమీటర్లు, ఇవ్వాళ ఏడు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. బెంగళూరు తిప్పసంద్ర కెంపేగౌడ విగ్రహం నుంచి మహాత్మా గాంధీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో సాగింది. తిప్పసంద్ర, బముల్ గేట్, ఇందిరా నగర్ 80 ఫీట్ రోడ్, ఇందిరానగర్, ఈఎస్ఐ ఆసుపత్రి రోడ్, దొమ్మలూరు 12వ మెయిన్ రోడ్, జోగుపాళ్య, చిన్మయానంద మిషన్, లక్ష్మీపుర, హలసూరు మెయిన్ రోడ్ మీదుగా ఎంజీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారాయన. ఆర్భాటంగా  మోడీ రోడ్ షో సాగింది. కాషాయరంగు వాహనంపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. వాహనానికి అన్ని వైపులా మోదీ ఫొటోలను అతికించారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు పూలను చల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. అభివాదం చేశారు. ఆయన ప్రయాణించిన రోడ్లల్లో పెద్ద ఎత్తున బ్యానర్లను అతికించారు బీజేపీ నాయకులు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇది ముగిసిన కొద్దిసేపటికే అదే బెంగళూరు రోడ్లపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. మోడీ ఆర్భాటంగా ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించిన అదే బెంగళూరు రోడ్లపై సాదాసీదాగా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఓ డెలివరీ బాయ్ టూవీలర్‌పై కూర్చుని సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రయాణించారు. టూవీలర్‌ను డెలివరీ బాయ్ డ్రైవ్ చేయగా, దాని వెనకల కూర్చుని రాహుల్ గాంధీ ప్రయాణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)