నల్ల గోధుమలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


గోధుములంటే బ్రౌన్ కలర్‌లో ఉండేవి మాత్రమే కాదు, నల్ల గోధుమలూ ఉంటాయి. అయితే ఈ నల్ల గోధుముల ధర మాములు గోధుమల ధర కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ నల్ల గోధుమలు షుగర్ పేషేంట్స్ కు ఒక వరం వంటివి అని పోషకార నిపుణులు చెబుతున్నారు. నల్ల గోధుమలతో తయారు చేసిన రొట్టెలను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. నల్ల గోధుమలలో గ్లూటెన్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. కనుక నల్ల గోధుమ పిండితో పుల్కా, చపాతీ, పరాఠా, బ్రెడ్ ఇలా ఏ రూపంలో ఉన్నా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా అందుతాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియ సమయంలో శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. దీంతో జీవక్రియ సమస్యలను నివారిస్తాయి. ఇవి క్యాన్సర్‌ను నయం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయట. బరువును అదుపులో ఉంచుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించే గుణం ఉందని పేర్కొన్నారు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉండడంతో త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గటానికి సహాయపడతాయి. నల్ల గోధుమలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నల్ల గోధుమలు కాలేయంలోని అదనపు కొవ్వును కరిగింది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. నల్ల గోధుమల పంట కొంచెం ఖర్చుతో కూడుకుంది. అంతేకాదు అనేక పోషక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో నల్ల గోధుమల ధర మార్కెట్‌లో సాధారణ గోధుమలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. సాధారణ గోధుమ ధర మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.2,000 ఉంటే,  నల్ల గోధుమ ధర క్వింటాల్‌కు రూ.7-8 వేల వరకు ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)