సెప్టెంబర్ 29 వరకు చెల్లుతాయి : ఆర్బీఐ

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తేలిసిందే. అప్పటి నుంచి గతంలో నోట్ల రద్దు సమయంలో చేసినట్లుగానే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో వెంటనే డిపాజిట్ చేసేందుకు ఖాతాదారులు పరుగులు తీస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో రద్దీ పెరిగిపోతోంది. అలాగే పెట్రోల్ బ్యాంకులు, ఇతర వ్యాపార సముదాయాల్లో రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు ఇప్పటికే నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది. బ్యాంకు ఖాతాదారులు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా మార్చుకోవడానికి పరుగులు తీస్తుండటంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ స్పందించారు. ఖాతాదారులు నోట్లను బ్యాంకుల్లో వెంటనే డిపాజిట్ చేసేందుకు తొందరపడవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ప్రజలు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు తాము ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30కు ఒక్క రోజు ముందు వరకూ ఇవి చెల్లుతాయని పేర్కొన్నారు. బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు డిపాజిట్ చేసేందుకు తాము ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30 అని మరోసారి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గుర్తుచేశారు. అప్పటి వరకూ మార్కెట్లో ఈ నోట్లు చెల్లుతాయని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఆయన తెలిపారు. కాబట్టి ఇప్పుడు జనం బ్యాంకుల వద్దకు పరుగులు తీయడంలో అర్ధం లేదన్నారు. మీకు బ్యాంకుల్లో ఈ నోట్ల డిపాజిట్ కు నాలుగు నెలల సమయం ఇచ్చామన్నారు. ఎలాగో తాము రూ.2 వేల నోట్ల డిపాజిట్ కు గడువు క్లియర్ గానే ఇచ్చినందున ప్రజలు దీన్ని మాత్రమే సీరియస్ గా తీసుకోవాలని, భయపడి ఇప్పుడే డిపాజిట్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. గతంలో నోట్ల రద్దు చేసిన తర్వాత పరిస్ధితులకు అనుగుణంగా రూ.2 వేల నోటును తీసుకొచ్చామని, ఇప్పుడు దాని అవసరం తీరిపోయినందున తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు రేపటి నుండి రూ.2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)