జగన్‌తో కలిసి ఇదే నా చివరి మీటింగ్‌ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 22 May 2023

జగన్‌తో కలిసి ఇదే నా చివరి మీటింగ్‌ !


ఆంధ్రప్రదేశ్ లోని  బందర్‌ పోర్ట్‌ లో రూ.5,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పనులకు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బౌలశౌరి తదితరలు మాట్లాడారు. అయితే దాదాపు ముప్పావు గంట పాటు మాట్లాడిన నాని తన రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే తనకు జగన్‌తో ఇదే చివరి మీటింగ్ కావచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లోపు వేదికపై నుంచి ఎమ్మెల్సీ రఘురాం తో మరికొందరు ఇక చాలంటూ వెనుక నుంచి వారించారు. కానీ పేర్ని మాత్రం ఆపకుండా ప్రసంగాన్ని కొనసాగించాడు. మొత్తానికి రాజకీయాల నుంచి ఇక రిటైర్‌ అయిపోతానన్న సంకేతాలు పేర్ని నాని  ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ‘పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. బందరు అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. తద్వారా బందరకు పూర్వ వైభవం రానుంది. కానీ నక్కజిత్తుల చంద్రబాబు బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా కోర్టులకు వెళ్లారు. అయితే వాటన్నింటిని ఎదురొడ్డి మరీ బందరు వాసుల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు. బందరు నియోజకవర్గంలో 25,090 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అలాగే సీఎం జగన్‌ బందరులో గోల్డ్‌ కవరింగ్‌ యూనిట్‌లను నిలబెట్టారు. ఏపీలో 31లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. సీఎం జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే’ అని పేర్ని నాని అన్నారు .

No comments:

Post a Comment