హైదరాబాద్ లో రెండు రోజులపాటు వర్షాలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో వరాగాల రెండు రోజులు  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయిని తెలిపింది.కానీ రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలను తక్కువని, వారం తర్వాత వాతావరణం సాధారణంగా మారిపోతుందని తెలిపింది. సోమవారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)