బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 May 2023

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు !


రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మొదట 100 మందిని లైంగికంగా వేధించినట్లు ప్రచారం చేశారని, ఇప్పుడేమో ఎకంగా 1,000 మందిని వేధించానని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇంత మందిని అలా చేయడానికి తానేమైనా శిలాజిత్‌తో తయారు చేసిన రోటీలు తింటున్నానా? అని నోరుజారారు. దీంతో బ్రిజ్‌ భూషణ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని అతనిపై ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్‌ సత్యవార్ట్ కదియాన్ మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఏడగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసనకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేసి, పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మొదట బ్రిజ్‌పై కేసు నమోదు చేయేలదు. కానీ చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్‌ భూషణ్ పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు నిరసన చేస్తే తాను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కాగా.. మహిళ రెజ్లర్లకు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. వారి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నలుపు రంగులో ఉండే శిలాజిత్ పౌడర్‌ను ఉపయోగిస్తే సామర్థ్యం పెరుగుతుందని అంటారు. ఇవీ క్యాప్సుల్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఇది తింటే పురుషుల శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయంటారు.

No comments:

Post a Comment