హోర్డింగ్ దొంగలు ఎత్తుకెళ్లారు !

Telugu Lo Computer
0


రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ ‭లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పుట్టిన రోజు కోసం వేసిన హోర్డింగ్ చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. తీవ్ర స్థాయిలో గాలింపు చేసి 24 గంటల్లోపు దొంగను పట్టుకున్నారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు రాత్రంతా వివిధ ప్రాంతాల్లో వెతికినట్లు సమాచారం. మే 3వ తేదీన సీఎం గెహ్లాట్ పుట్టినరోజు కావడంతో నగరంలో పలుచోట్ల ఆయన హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జైపూర్‌లోని విశ్వకర్మ ప్రాంతంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారు వీకేఐ రోడ్డు సమీపంలో ఒక హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగునే గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దొంగతనం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ ఇనిస్టిట్యూట్ జిల్లా అధ్యక్షుడు సీతారాం సైనీ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హోర్డింగ్ చోరీకి గురైన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దాని ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డ కపిల్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని విచారించగా చాలా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. దొంగ ఓ హోర్డింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే సదరు కంపెనీ వారు తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో హోర్డింగు దొంగతనం చేసినట్లు వెల్లడించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)