భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య !

Telugu Lo Computer
0


భార్య పుట్టింటికి వెళ్లి రావట్లేదని మనస్తాపానికి గురైన భర్త రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పాత పంచాయతీ ఆఫీసు దగ్గరలో ఉండే ధాత్రిక నర్సింహ (54) ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మద్యానికి బానిసై రోజూ తాగొచ్చి భార్య సుమలతను వేధించేవాడు. తాగుడు మానేయాలని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినకపోవడంతో సుమలత ఇద్దరు పిల్లలను తీసుకుని మూడేండ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చేందుకు నర్సింహ ఎన్నివిధాలుగా ప్రయత్నించినా సుమలత నిరాకరించింది. మనస్తాపానికి గురైన నర్సింహబుధవారం మేడ్చల్- మనోహరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీ ఉందన్న సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించి.. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)