రాజస్థాన్‌ లో రాజాసింగ్‌పై కేసు నమోదు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని  గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌ పై మరోకేసు నమోదైంది. ఈసారి రాజస్థాన్ లో కేసు నమోదైంది. ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌పై మరో కేసు నమోదు కావడంతో హాట్ టాపిక్ గా మారింది. మతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. రాజాస్థాన్ పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు. మహారాణా ప్రతాప్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజాసింగ్ ఇటీవల రాజస్థాన్ వెళ్లారు. అయితే అక్కడి ప్రతాప్ చౌక్‌లో ఆయన ప్రసంగించారు. కున్హాడి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సభ నిర్వహించగా రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కున్హాడి పోలీసులు 153 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక గతంలోనూ రాజాసింగ్‌పై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక ఆ సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు కంఫ్లైంట్ ఇచ్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులు రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1 (ఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)