కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న ప్రహ్లాద్ జోషి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 13 May 2023

కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న ప్రహ్లాద్ జోషి !


కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.ప్యాంట్, టీషర్టుతో జోషి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల బయలుదేరారు. తిరుపతికి చెందిన బీజేపీ నాయకులు సైతం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెంటలేరు. ఇద్దరు పోలీసు, పర్సనల్ సెక్యూరిటీ గార్డులు మాత్రమే ప్రహ్లాద్ జోషి వెంట కాలినడకన తిరులమలకు బయలుదేరారు. ఆ సెక్యూరిటీ కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి దూరంగా నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. ప్రహ్లాద్ జోషిని చాలా మంది గుర్తు పట్టుకోవడంతో ఆయన సామాన్య భక్తుడిలా తిరుమల చేరుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కర్ణాటకలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించారని తెలిసింది. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేరు కూడా ఉంది. కేంద్రంలోని పెద్దలతో నిత్యం టచ్ లో ఉంటున్న ప్రహ్లాద్ జోషి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఇప్పటికే మంచి మార్కులు సంపాధించారు. ప్రహ్లాద్ జోషి సీఎం అయితే పరిస్థితులు మరోలా ఉంటాయని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే కొందరు బీజేపీ పెద్దలు ప్రహ్లాద్ జోషి ఎందుకు సీఎం కాకూడదు అని బీజేపీలోని నాయకులనే కొందరిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మొత్తం మీద తనను విమర్శించిన వాళ్లు ఓడిపోవాలని, బీజేపీ హైకమాండ్ తనకు అప్పగించిన బాధ్యతలు నేరవేర్చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తిరుమల వెళ్లి ఉంటారని తెలిసింది.

No comments:

Post a Comment