జలంధర్‌ లోక్‌సభ స్థానంలో ఆప్‌ ముందంజ

Telugu Lo Computer
0


పంజాబ్‌ లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ  ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఆప్‌ అభ్యర్థి సుశీల్‌ రింకూ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కరమ్‌జీత్‌ కౌర్‌పై దాదాపు 7 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సుశీల్‌ రింకూకు 60,088 ఓట్లు పోలవగా, కరమ్‌జీత్‌ కౌర్‌కు 53,023 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత బీజేపీ 34,051 ఓట్లతో మూడో స్థానంలో, శిరోమణి అకాలీదళ్‌ 28,351 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. జలంధర్‌ ఎంపీ సంతోక్‌ సింగ్‌ ఛౌదరి గుండెపోటుతో హఠాన్మరణం పాలవడంతో ఆ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. గత జనవరిలో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా సంతోక్‌ సింగ్‌ గుండెపోటుతో మృతిచెందారు. కాంగ్రెస్‌ ఎంపీ మరణంతో ఉప ఎన్నికల వచ్చినా అక్కడ ఇప్పటివరకైతే కాంగ్రెస్ అభ్యర్థిపై ఓటర్లు సానుభూతి చూపినట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని ఐదు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో పంజాబ్‌లోని జలంధర్‌, ఉత్తరప్రదేశ్‌లోని సువార్‌, ఛంబే, ఒడిశాలోని ఝార్సుగూడ, మేఘాలయలోని సోహియాంగ్‌ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)