కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 13 May 2023

కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా !


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి ఘన విజయాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. దీంతో కర్ణాటకలోనే కాకుండా యావత్ భారతదేశమంతా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక గెలుపు తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకు నాంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ గెలుపు పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతూనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుపు రిపీట్ అవుతుందని ఆశించే కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదన్నారు. కేరళ సోరీ సినిమా పొరుగు రాష్ట్రాల్లో ఎలా విఫలమైందో అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవు అని పేర్కొన్నారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటకపై ఓటర్లపై ప్రభావం చూపించటంతో పూర్తిగా విఫలమైందని అదే మాదిరిగా కన్నడ ఫలితాలు తెలంగాణలో జరగవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి చురకలు వేస్తూ నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment