తండ్రి పుట్టిన రోజును చేతిపై పచ్చ బొట్టు.....!

Telugu Lo Computer
0


శరణ్య అనే యువతి తన ఎడమ చేతిపై 05-02-1978 అని పచ్చ బొట్టు పొడిపించుకుంది. అది తండ్రి పుట్టిన రోజుకు సంబంధించింది. ఆమె పచ్చ పొడిపించుకున్న తర్వాత దాన్ని ఫొటో తీసింది. ఆ ఫొటోను తన తండ్రికి వాట్సాప్‌ చేసింది. ఆ ఫొటోను చూడగానే ఆయన ఫైర్‌ అయ్యాడు. 'నేను నిన్ను చంపుతా' అంటూ మెసేజ్‌ పెట్టాడు. తండ్రి పెట్టిన మెసేజ్‌ను శరణ్య స్క్రీన్‌ షాట్‌ తీసింది. తర్వాత దాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. 'మా నాన్న నా ట్యాటూను అంగీకరించారు' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)