షుగర్ వ్యాధి - బీన్స్ !

Telugu Lo Computer
0


షుగర్ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్ , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీన్స్ వంటి బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించగల కొన్ని కూరగాయలు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బీన్స్ డయాబెటిక్ రోగులకు మంచి ఆహారం.  అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, బీన్స్ చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడానికి కారణం. బీన్స్‌లో ప్రోటీన్ , ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తాయి. న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, పింటో బీన్స్, బ్లాక్ బీన్స్ లేదా రెడ్ కిడ్నీ, బీన్స్ తిన్న టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగుల రక్తంలో చక్కెర పెరుగుదల కనిపించలేదు. బీన్స్ తిన్న 90, 120 , 150 నిమిషాల తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. బీన్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ ఉన్న రోగులకు మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వాటిలో ఫైబర్ కూడా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. బీన్స్ బియ్యం లేదా బంగాళదుంపల కంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. వైద్యుల సలహా ప్రకారం, బీన్స్ అన్నం లేదా రోటీతో కలిపి తినవచ్చు. కొంతమంది దీనిని సైడ్ డిష్‌గా కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు, బీన్స్‌ను సలాడ్‌లు, సూప్‌లు కూడా వాడుకోవచ్చు. అయితే, దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం అవసరం. బీన్స్ నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి, వెల్లుల్లి , అల్లంతో కలిపి తినాలని కొందరు వైద్యులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)