నరేంద్ర మోడీకి ఫిజీ అత్యున్నత పురస్కారం !

Telugu Lo Computer
0


ఫిజీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది . అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ నేతగా ప్రధాని మోడీ చూపిస్తున్న చొరవకు గుర్తింపుగా "ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి" సత్కారంతో గౌరవించింది ఆ దేశ ప్రభుత్వం. ఫిజీ దేశస్థులు కానివారికి ఈ అవార్డు ఇవ్వడం అరుదు. ప్రధాని మోదీ ఈ మెడల్‌ను ఫిజీ ప్రధాని సితివెని రాబుకా నుంచి అందుకున్నారు. "భారతదేశానికి పెద్ద గౌరవం. ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ప్రధాని మోడీకి ఫిజీ ప్రధాన మంత్రి ఫిజీ అత్యున్నత గౌరవం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అందించారు. ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు" అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ప్రధాని మోడీ ఈ గౌరవాన్ని భారత దేశ ప్రజలకు అంకితం చేశారు. అలాగే  ఫిజీలో ఉంటున్న భారత కమ్యూనిటీ వారికి అంకితం చేశారు. ఫిజీలోని భారత కమ్యూనిటీ వారు రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు కీలక పాత్ర పోషించారని అన్నట్లుగా భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ఫిజీలో జరిగిన ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోపరేషన్ లో పాల్గొన్న సందర్భంగా.. ప్రధాని మోడీ ఫిజీ ప్రధాని రాబుకాని కలిశారు. ఫిజీ ప్రధానిని కలవడం ఆనందదాయకం. మేము రకరకాల అంశాలపై మాట్లాడుకున్నాం. భారత్, ఫిజీ మధ్య సంబంధాలు కాలపరీక్షను తట్టుకొని నిలబడ్డాయి. రానున్న సంవత్సరాల్లో ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా కృషి చేస్తాం అని  ప్రధాని ట్వీట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)