గజల్‌ శ్రీనివాస్‌కు సత్కారం !

Telugu Lo Computer
0


ప్రముఖ గజల్‌ గాయకుడు డాక్టర్ గజల్‌ శ్రీనివాస్‌కు 'సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం' జరిగింది. సంత్‌ కబీర్‌ ఉత్సవ్‌ సందర్భంగా ఏప్రిల్‌ 30న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్వరంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి ఆధ్వర్యంలో కబీర్‌ దోహే, సూఫీ గజల్‌ గానం కార్యక్రమం నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ ఆలపించిన కబీర్ దోహే, సూఫీ ఉర్దూ గజల్ గానం ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిందని.. వారాణాసికి చెందిన తానా బానా మ్యూజిక్ బ్యాండ్ కబీర్ సాహిత్య గానం శ్రోతలను ఆకట్టుకుందని నిర్వాహకులు గురు చరణ్ దాస్, అంజన్ సక్సేనా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇండోర్‌ ఆకాశవాణి డైరెక్టర్‌ సంతోష్ అగ్నిహోత్రి గజల్‌ శ్రీనివాస్‌కు 'సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం' అందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)