ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు !

Telugu Lo Computer
0


పశ్చిమ  బెంగాల్‌లో ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకొని దంపతులుగా మారారు. పెళ్లి చేసుకున్న స్వలింగ సంపర్కుల పేర్లు మౌసుమి దత్తా, మౌమిత. వీరిద్దరికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మౌసుమీ పిల్లలను మౌమిత తన పిల్లలుగా స్వచ్ఛందంగా అంగీకరించడంతో వీరి పెళ్లి జరిగిపోయింది. మౌసుమీ దత్తా అనే మహిళకు ముందు వివాహమైంది. భర్త ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన భర్త తనను రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అందుకే తన భర్త నుంచి విడిపోయానని దత్తా మీడియాకు తెలిపారు. మౌమితను ప్రశ్నిస్తే  ప్రేమ అనేది స్త్రీ పురుషుల మధ్య మాత్రమేనా? ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు ప్రేమలో కలిసి ఉండలేరా? అని సమాధానం ఇచ్చారు. ఈ పెళ్లికి మౌమిత కుటుంబీకులకు ఇష్టం లేకపోవడంతో మౌసుమీ దత్తాను ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో జీవితాంతం కలిసే ఉంటానని ప్రమాణం చేసినందున మౌషుమిని విడిచిపెట్టబోనని ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టింది. దేవుడి సాక్షిగా చింఘిఘాట్‌లోని బగ్దర్‌లోని భూతనాథ్ ఆలయం ముందు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మౌమితా మజుందార్ కొన్ని రోజులకు కోల్‌కతాకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె లేకుండా నేను జీవించలేనని గ్రహించానని మౌసుమి తెలిపింది. "నీళ్ళు లేకుండా చెట్టు బతకదు, అందుకే మౌమిత లేకుండా నేను బతకలేనంటూ తేల్చి చెప్పింది. అందుకే వెంటనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకొని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)