చికిత్స చేసిన డాక్టర్‌ను చంపిన ఉన్మాది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 10 May 2023

చికిత్స చేసిన డాక్టర్‌ను చంపిన ఉన్మాది !


కేరళలోని కొల్లాం జిల్లాలోని ఓ ఎయిడెడ్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సందీప్ గత కొద్ది కాలం నుంచి డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. డ్రగ్స్ సేవించి పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఇబ్బంది పెడుతుండటంతో అతడిని సస్పెండ్ చేశారు. స్థానికులతో గొడవలు పడటం మొదలు పెట్టాడు. మంగళవారం కుటుంబ సభ్యులతోనూ గొడవ పెట్టుకోవడమే కాకుండా స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. ఈ గొడవల్లో తన కాలికి దెబ్బతగిలిందని, నడవలేకపోతున్నానని, ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ పలుమార్లు ఫోన్ చేసి విసిగించాడు. పోలీసులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు చేసిన ఫిర్యాదుదారుడు కావడంతో పోలీసులు ఎటువంటి సంకెళ్లు వేయలేదు. ఆ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ డాక్టర్ వందన.. అతడికి వైద్య పరీక్షలు చేసి, కాలికి చికిత్స అందిస్తుండగా  ఒక్కసారిగా అక్కడే ఉన్నకత్తెరతో నిన్నుచంపేస్తా అంటూ డాక్టర్ వందన ఛాతీలో ఐదు సార్లు పొడిచాడు. అక్కడే ఉన్న పోలీసుపై కూడా దాడి చేశాడు. ఆసుపత్రిలో ఉన్న వస్తువులన్నీ పగుల గొట్టేశాడు. అప్పుడు అతడికి సంకెళ్లు వేసి, అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ వందనను వెంటనే తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు చూసి ఆమె మృతి చెందిందని చెప్పారు. ఈ దాడిని ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ ఖండించింది. ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని కేరళ వైద్యులు అన్నారు.

No comments:

Post a Comment