ఆటో డ్రైవరే హత్య చేశాడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 10 May 2023

ఆటో డ్రైవరే హత్య చేశాడు !


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో అదృశ్యమైన మహిళ శవంగా మారింది. పరిచయస్తుడే ఆమెను హత్య చేశాడు. నమ్మి తనతో వెళ్లిన పాపానికి పథకం రచించి.. ఊపిరి తీసాడు. ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. విశాఖ తగరపువలస బాలాజీ నగర్ కు చెందిన రేసు గోపి అనే మహిళ నివాసముంటుంది. ఆమెకు ఏడేళ్ల బాబు కూడా ఉన్నాడు. ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. అయితే, బంధువుల శుభకార్యానికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె కోసం ఆరా తీయడం ప్రారంభించారు ఆమె బంధువులు. ఎంత వెతికినా కనిపించకపోయేసరికి ఈనెల 1న భీమిలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రెండో తేదీన మిస్సింగ్ కేసు కూడా నమోదయింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చేపలుప్పాడకు చెందిన ఆటో డ్రైవర్ మైలిపల్లి రాజుపై బంధువులకు అనుమానం కలిగింది. కొన్ని వివరాలతో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఆటో డ్రైవర్ మల్లెపల్లి రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో రేసు గోపి తానే హతమార్చినట్టు ఒప్పుకున్నాడు. మరి మృతదేహం కోసం ప్రశ్నించేసరికి చిలుకూరి లేఔట్ గెడ్డలో మృతదేహం పడేసినట్టు చెప్పుకొచ్చాడు. మైలిపల్లి రాజు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి చూసేసరికి కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బంధువుల కూడా అదే ఆమెదేనని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. గత కొన్నేళ్ల నుంచి గోపితో ఆటో డ్రైవర్ రాజుకు పరిచయం ఉంది. అది కాస్త సాన్నిహిత సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ దూరమయ్యారు. శుభకార్యం వద్ద కనిపించేసరికి మళ్ళీ ఒకరికొకరు మాట కలిపి దగ్గరయ్యారు. ఇదే క్రమంలో తన వద్ద బంగారం దండిగా ఉందన్న సంగతి తెలుసుకున్న రాజు  ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆటోను స్టార్ట్ చేసేందుకు వినియోగించే తాడుతో మెడ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీరంపై ఉన్న నాలుగు తులాల బంగారాన్ని రాజు ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment