ఒంగోలు డీఎస్పీకి స్థానచలనం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో 50 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా ఒంగోలు డీఎస్పీగా నియమించిన అశోక్ వర్ధన్ ను దర్శికి బదిలీ చేసింది. ఛార్జ్ తీసుకున్న రెండు రోజులకే ఒంగోలు డీఎస్పీ అశోక్ వర్ధన్ అక్కడి నుంచి బదిలీ కావడం గమనార్హం. బదిలీల్లో ఒంగోలు డీఎస్పీగా నారాయణస్వామి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కాగా కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని, ఒంగోలు డిఎస్పీగా అశోక్ వర్ధన్ ను నియమించడంపై కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించే ప్రయత్నంలో బాగంగా అశోక్ వర్ధన్ ను బదిలీ చేసినట్టు తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితం రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్టీ అధినేత,  సీఎం వైఎస్ జగన్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం అయ్యారు. ఆ తరువాత నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో సీఎం జగన్ బాలినేనికి ఏం చెప్పారు ? బాలినేని ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు చేరుకున్నారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఒంగోలు వచ్చిన బాలినేనికి వైసీసీ శ్రేణులు ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఒకరకంగా ఒంగోలులో బాలినేని బలప్రదర్శన నిర్వహించారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరిగింది. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, ఒంగోలు(Ongole) ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల అన్నారు. కొందరు కావాలనే తనపై ఈ రకంగా చేయిస్తున్నారని అనిపిస్తోందని.. అలా వాళ్లు ఎందుకు చేయిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తన విషయంలో ఇలా చేస్తున్న వాళ్లు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో ఆలోచించుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తన నియోజకవర్గంపై ఫోకస్ చేయాల్సి ఉందని.. అందుకే రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. తనను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలుసని.. వారి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని బాలినేని చెప్పుకొచ్చారు. తనకు వైఎస్ఆర్ రాజకీయభిక్ష పెట్టారన్న బాలినేని.. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా వ్యవహరించానని అన్నారు. తన గురించి మాట్లాడాల్సిన అవసరం గోనె ప్రకాశ్ రావుకు  ఏముందని ఆయన ప్రశ్నించారు. కొందరు కావాలనే అలా మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నట్టు తెలిపారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)