జూన్ నెలలో అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభం !

Telugu Lo Computer
0


జూన్ నెలలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అమరజ్యోతి ప్రాంగణాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్‌స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూమ్, లిఫ్టులు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్తులో రెస్టారెంట్, నిత్యం మండుతున్న జ్యోతి ఆకారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అన్ని రకాల అధునాతన సాంకేతికతతో, అరుదైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో మెమోరియల్‌ని అన్ని హంగులతో నిర్మించామని తెలిపారు. అరుదైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ఇదేనని తెలిపారు. ఒక్కసారి ఈ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రపంచం అబ్బురపడుతుందని అంటున్నారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు చేయబోతున్నామని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)